Sunday, 23 February 2014

ప్రముఖ కథా రచయితల చేవ్రాలు..మీకోసం..

కథా ప్రయాణం - 18

ప్రముఖ కథా రచయితల చేవ్రాలు..మీకోసం...మీకు ఎంతమంది తెలుసో గుర్తించండి.

సేకరణ : కథా సదస్సు కొత్త కదలిక నుంచి


            వేదగిరి రాంబాబు గారి సహకారంతో...

Saturday, 15 February 2014

అమరావతి కథలు

కథా ప్రయాణం -17


అమరావతి కథలు


క్లుప్తత కథకు ఉన్న ప్రధాన లక్షణం. అతి తక్కువ పాత్రలతో కథలు నడిపించడం సామాన్యమైన విషయం కాదు. ఆంగ్ల సాహిత్యంలో చిన్న కథలు రాయడంలో చహోను మించిన వారు లేరు. చహో కథల్లో ముగింపు అనూహ్య పరిస్థితుల్లో ముగుస్తుంది. పాఠకులను కన్నీటి సముద్రంలో ముంచేస్తుంది. కథ ఇలా ఉంటేనే బాగుంటుందని చెప్పడానికి సాంకేతికమైన పదాలు ఏమీ లేవు. అందుకే చహో ఆంగ్ల సాహిత్యంలో ధ్రువతారగా మిగిలిపోయాడు. అదే ఒరవడిని కొనసాగిస్తూ సత్యం శంకరమంచి అధ్బుత రీతిలో అమరావతి కథలకు ప్రాణ ప్రతిష్ట చేశాడు. ఒకే ప్రాంత నేపధ్యంలో వచ్చిన కథలు అమరావతి కథలే కావచ్చు. కథల్లోని పాత్రలు, సన్నివేశాలు కృష్ణానది ఇసుకతిన్నేలు మన కళ్ళ ముందే కనబడతాయి. ఒక దృశ్యం మన కళ్ళ ముందే కదిలిన అనుభూతి కలిగిస్తుంది. వరద, పూలసుల్తాన్, పులి, తృప్తి, అధ్బుతంగా సాగుతాయి. అమరావతి కథలకు బాపు వేసిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

Wednesday, 5 February 2014

కధ తో ముడి పడిఉన్న కొన్ని జాతీయాలు

కథా ప్రయాణం-16

కధ తో ముడి పడిఉన్న కొన్ని జాతీయాలు

1. నీ కథ చాలాదూరం వచ్చిందే..
2. కథ వెనుక కథ
3. కథకు కాళ్లు లేవు..ముంతకు చెవులు లేవు..
4. కథకు కాళ్లు, ముంతకు చెవులు కల్పించు
5. కథ కంచికి..మనం ఇంటికి..
6. కథ కట్టిపెట్టు..
7. కథ చాలా దూరం వెళ్లిందే..
8. కథ తెలిసి వచ్చింది
9. కథల కామరాజు
10.హరికథలు చెప్పకు
11. కథల పన్ను
12. కథలు కారణాలు
13. కథలు-కారుణ్యాలు
14. అదంతా ఓ పెద్ద కథ
15. కథ కమామీషు
16. కథనాయకుడు
17. కథా శేషుడు కావడం
18. గాలి వాన వస్తే కథే లేదు
19. ఈ కథ ముగిసినట్లే..
20. కాశీ మజిలి కథలు చెప్పకు
21. కట్టుకథల చిత్రాంగి
22. కథా కథనాలు
23. కాకి తో కబురుపంపిస్తే కథ తెలిసింది.
24. కథలు కథలుగా చెప్పుకోవడం
25. కథలు కాకరకాయలు
26. కథన కుతూహలం

- వేలూరి కౌండిన్య   6-2-14                 

Saturday, 1 February 2014

తెలుగు కథా సాహిత్యంలో మైలురాళ్ళు

తెలుగు కథా సాహిత్యంలో మైలురాళ్ళు

1. తొలి కథా రచన
జ. తాతాచార్యుల కథలు (1855)
2. మలి కథా రచన
జ. 1903
3. తొలి కథా రచయిత్రి
జ. బండారు అచ్చమాంబ
4. వ్యవహారిక భాషలో తొలి కథా రచయిత
జ. గురజాడ అప్పారావు (దిద్దుబాటు)
5. మత మార్పిడుల నేపథ్యంలో రాసిన తొలి కథ
జ. పెద్ద మసీదు
6. తెలుగు కథ మీద వచ్చిన మొదటి పరిశోధనా గ్రంథం
జ. తెలుగు కథ స్వరూప స్వభావం (పోరంకి దక్షిణామూర్తి)
7. సంచార జీవితాలపై రాసిన తొలి కథ
జ. దాసరి పాట (చింతా దీక్షితులు)
8. తొలి కథ సంకలనం
జ. మద్రాస్ కథలు (వెదురుమూడి శేషగిరిరావు)
9. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి కథ
జ. గాలివాన (పాలగుమ్మి పద్మరాజు)
10. మాండలిక భాషలో మొదటిసారిగా కథలు రాసిన వారు
జ. మా గోఖలే
11. తొలిసారిగా సంభాషణలే ప్రధానంగా కథ నడిపిన రచయిత
జ. శ్రీపాద
12. తనమీద తానే కథ రాసుకున్న రచయిత
జ. చలం (ఒరేయ్ చలం)
13. కథా బీజాలు దేనిలో కనిపిస్తాయి
జ. ఋగ్వేదం
14. స్వాతంత్ర్య ఉద్యమం నేపధ్యంలో రాయబడ్డ తొలి కథ
జ. ఓబయ్య (వేలూరి శివరామ శాస్త్రి)
15. కథల కోసమే నడపబడ్డ తొలి కథా పత్రిక
జ. పూలగుత్తి
16. కథక చక్రవర్తి
జ. కవి కొండల వెంకటరావు
17. కనకాభిషేకం జరిగిన తొలికథ చక్రవర్తి
జ. శ్రిపాద సుబ్రహ్మన్య శాస్త్రి
18. కథానిక లక్షణాలు వున్న తొలి గ్రంథం
జ. అగ్ని పురాణం
19. కార్డు కథలను మొదటిసారిగా ప్రచురించిన పత్రిక
జ. చిత్రగుప్త