Monday, 9 December 2013

కథా ప్రయాణం-5

కథా ప్రయాణం-5

తెలుగులో ఉత్తమ కథకులుగా, ధ్రువతారలుగా నిలిచిపోయేవారు కొందరే ఉన్నారు. వారి కథలను పరిశీలిస్తే వారెంత మనుషులో మనకు తెలుస్తుంది. గురజాడ,వేలూరి,బుచ్చిబాబు,గోపిచంద్, చలం, శ్రీపాద, మల్లాది, కొడవటిగంటి కుటుంబరావు, కరుణ కుమార్,చాసో, పాలగుమ్మి పద్మరాజు, చింతా దీక్షితులు, అడవి బాపిరాజు, కా.రా.., జమదగ్ని, మా గోఖలే, అమరేంద్ర, పంతుల శ్రీ రామశాస్త్రి, రావి శాస్త్రి, ఆచంట శారదా దేవి, రావూరి భరద్వాజ, కాళోజి, గూడూరి సీతారం,  ఇల్లెందుల, కొమర్రాజు, భాగ్య రెడ్డి వర్మ లాంటి వందల మంది తెలుగు కథలు పరిపుస్టం చేసారు. ఫ్రాంతాల వారీ విడిపోవచ్చు. కులాలుగా విడిపోవచ్చు. దేశాల సరిహద్దులను చెరిపి వేయచ్చు. విశ్వ మానవ సౌభాతృత్వాన్ని కోరేది మాత్రం సాహిత్యమే. 
     తెలుగు కథా సాహిత్యం విశ్వనాథ లాంటి పండితుల్ని, వేలూరి లాంటి శతావధానుల్ని అడవి బాపిరాజు లాంటి చిత్రకారుల్ని చింతా దీక్షితులు, చలం లాంటి ఉన్నతాధికారుల్ని, పీవీ నరసింహారావు లాంటి రాజకీయవేత్తల్ని ఆకర్షించింది. శ్రీ పీవీ నరసింహారావు దేశ ప్రధాని, ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. బహుభాషా వేత్త. విశ్వనాథ వేయి పడగల్ని సహస్రఫణ్ పేరుతో అనువదించారు. గొల్ల రామవ్వ లాంటి గొప్ప కథను రాశారు. ఒకటి, రెండు కథలు తప్ప అందుబాటులో లేవు. 
     చింతా దీక్షితులు(1891) గొప్ప కథకులు. తొలితరం కథకుల్లో లెక్కించతగినవారు. దాసరిపాట లాంటి గొప్ప కథల్ని రచించారు. వటిరావు కథలు దీక్షితులు గారి ప్రత్యేకం. చలం గారి సమకాలీకులు.

- వేలూరి కౌండిన్య 10-12-13. 
 



No comments:

Post a Comment