కధా ప్రయాణం - 3.
గురజాడ రాసిన 'దిద్దుబాటు కధ ఆంధ్రభారతిలో 1910 ఫిబ్రవరిలో అచ్చయితే మాడపాటి హృదయశల్యము కధ. 1912 లో ఆంధ్రభారతిలోనే అచ్చయింది. 1902 ప్రాంతంలో ఆచంట వెంకట సాంఖ్యనశర్మ 'లలిత ' అనే కథను రాశారు. ఇది కూడా గ్రాంధిక భాషలోనే సాగడం విశేషం. వీరే కధల కోసం ' పూలగుత్తి ' అనే కథను నడిపారు. బండారు అచ్చమాంబ కథ స్త్రీ విద్య విత్తనమైతే, సుక్షేత్తమైన నేలలో పడటం వల్ల,నేడది ఇంతితై వటుడింతై అన్నట్లు శాఖోపశాఖలుగా విస్తరించింది. వచ్చిన కథలన్నీ గొప్ప కథలని చెప్పలేం, కాలానికి నిలిచే కథ ఏది అంటే జవాబు చెప్పటం కష్టం. ఏ కధలో నైతే జీవ లక్షణం వుంటుందో అదే జీవకధ అవుతుంది. కధ దాటిన ఎల్లలు లేవు. తిరగని బోటులేదు. ఎక్కని పర్వతాలు లేవు. చంధోబద్ధమైన కవిత్వం తరువాత, కథ తరువాత స్ధానాన్ని ఆక్రమిస్తుంది. ఆంగ్లభాష, ప్రభావం, తెలుగు కధను పరిపుష్టం చేసిందనటంలో సందేహం లేదు.
No comments:
Post a Comment