Saturday 25 January 2014

కథా ప్రయాణం -14

కథా ప్రయాణం -14


బాగు..బాగు అనిపించుకున్న భమిడిపాటి కామేశ్వర రావు ప్రాధానంగా హాస్య రచయిత. బాగు..బాగు, పెళ్ళి కంట్రోల్, పెళ్ళి ట్రైనింగ్, కచటతపలు వంటి ఎన్నో హాస్య నాటికలు రచించారు. కథానికా సాహిత్యం వీరిని ఆకర్షించడంలో తప్పు లేదు. చదువరు లెవరివైనా తేలికగా ఆకర్షీంచేది కథా సాహిత్యం. అందుకు కారణం అందులో జీవ లక్షణం ఉండడమే. హాస్య కథలు రాయడం అంత ఆషామాషి కాదు. నవకాయ పిండి వంటల్లో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుందో అందులో హాస్యరసం లోపిస్తే అనితర సాధ్యమైన హాస్యాన్ని కథల్లో జొప్పించిన కథకుడు భమిడిపాటి. నిజం, ఔను, తనలో అనే పేరుతో 3 కథా సంపుటాలను ప్రచురించారు. మడత పేజి కథ తప్పక చదవాల్సిందే. 

Friday 24 January 2014

కథా ప్రయాణం-13

కథా ప్రయాణం-13


తెలుగు సాహిత్యంలో రెండు సంఘటనలు తప్పనిసరిగా గుర్తుచేసుకోవాలి. భిన్న మనస్తతత్వాలు, భిన్న ధోరణులు, తూర్పు,పడమరలు. వారు ఒకరు చలమైతే, మరొకరు కథా మాణిక్యం మునిమాణిక్యం నరసింహారావు. ఒకరు విశృంఖుల శృంగారాన్ని ప్రోత్సహిస్తే మరొకరు దాంపత్యంలోని మధురిమలను అందించారు. భార్య అంటే ఎలా ఉండాలి?సంసారంలోని మధురిమలు ఎల పొందాలి అన్న విషయాన్ని హాస్యభరితంగా చెప్పాడు మునిమాణిక్యం. మునిమాణిక్యం కథానాయక కాంతం. ఆధునిక తెలుగు సాహిత్యంలో కాంతం ఐస్కాంతంలా ఎందరిని అలరించలేదు. కాంతం పేరు తెలియని తెలుగు పాఠకుడు ఉండడు. పరమ సంతోషకరమైన కుటుంబ జీవిత ఇతివృత్తాన్ని కథగా చెప్పిన కథా కృషీవలుడు. గందరగోళంగా ఉన్న తెలుగు సాహిత్యంలో ఒయాసిస్సు లాగా, వెన్నెల రాత్రి లాగా ఆయన కథలు దర్శనమిస్తాయి. కాంతం కథలు నేను నా కాంతం, తిరుమాలిగ, రుక్కుతల్లి లాంటి హాస్య కథలు ఎన్నో రాశారు. ఆయన కథలన్నీ శారద రాత్రులే.

వేలూరి కౌండిన్య.. 24-1-14

Saturday 18 January 2014

నా పుస్తక సమీక్ష

12-1-14న ఆంధ్రభూమి దినపత్రిక మెరుపు శీర్షికలో నా పుస్తక సమీక్ష ప్రచురితమైంది. చదివి మీ అభిప్రాయం తెలుపగలరు. 

Tuesday 14 January 2014

Sunday 12 January 2014

కథా ప్రయాణం-12

కథా ప్రయాణం-12


కథా సాహిత్యంలో రాసి కన్నా వాసి ముఖ్యం. క్లుప్తత అంతకన్నా ముఖ్యం. చెప్పదలుచుకున్న విషయాన్ని ఏ మాత్రం భేషిజం లేకుండా చెప్పడం, నినాదాల జోలికి పోకుండా సూటిగా ఆలోచింపజేయడం కథానికలో ఒక భాగం. కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారిలో చా.సో.(చాగంటి సోమయాజులు) నేటి తరం కమ్యూనిస్టులుగా కాకుండా వామపక్ష భావాలు కలిగి నినాదాలు, కొట్టు,చంపు, నరుకు పదాలులేకుండా శ్రామైక్య జీవనంలోని అందాలను చక్కగా వర్ణించిన కధా రచయత చా.సో.రాసినవి 30 కథలకు మించకు పోయినా తన రచనా కౌశలం ద్వారా కీర్తి గడించారు చా.సో. వీరి కథలు విశిష్టత, సాంఘిక ప్రయోజనం కలిగి ఉంటాయి. బొండు మల్లేలు, ఎందుకు పారేస్తాను నాన్న, వెలం వెంకడు కథలు చదవాల్షిందే.


నోట్ : మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేస్తారు కదూ..

9392942485


















స్వామి వివేకానంద జయంతి

స్వామి వివేకానంద జయంతి