Tuesday 11 November 2014

kanniiti kanakam

cine actress kanakam pai nenu raasina story 12-11-14 sakshi vijayawada edition lo publish indi...

http://epaper.sakshi.com/

Thursday 6 November 2014

వీణాపాణి గారి ఇంటర్వ్యూ..

5-11-14న సాక్షి విజయవాడ సిటీ టాబ్లాయిడ్ లో నేను వీణాపాణి గారిని చేసిన ఇంటర్వ్యూ..

Sunday 20 July 2014

కథా యాత్ర-20

కథా యాత్ర-20
శివ శంకరులు పూర్వాశ్రమంలో శివశంకర శాస్త్రి. ఈయన పేరు చెప్పగానే సాహిత్యాభిమానులకు హృదయేశ్వరి, నవలా మాలిక, వంటి కావ్యాలను ప్రచురించారు. ప్రఖ్యాత కథకులు విశ్వనాథ, వేలూరి, చలం, కొనికళ్ళ, నారాయణ స్వామి లాంటి చాలా మందితో స్నేహంగా ఉండేవారు. సాహిత్య మాసపత్రిక, సాహితీ సమితి, నవ్య సాహిత్య పరిషత్ వంటి సంస్థలను ఎక తాటిపై నడిపారు. పలు సంకలనాలకు సంపాదకత్వం వహించారు.


(గత కొన్ని నెలలుగా అస్వస్థ వల్ల కథాయాత్ర కొనసాగించలేకపోయాను. ఇకపై కలుస్తూ ఉందాం.
మీ కౌండిన్య 9392942485)

Thursday 10 April 2014

కధాయాత్ర - 18

కధాయాత్ర - 18
       శివశంకరులు పూర్వాశ్రమంలో శివశంకరశాస్త్రి. వీరి పేరు చెప్పగానే సాహిత్య అభిమానులకు హృదేశ్వరి నవకళామాలిక వంటి ఖండకావ్యాలను ప్రచురించారు. ప్రఖ్యాత కధకులు విశ్వనాధ, వేలూరి, చెలం, కొనికళ్ల, అందే నారయణ లాంటి చాలామందితో స్నేహసంబంధాలు ఉండేవి. వీరు స్థాపించిన సాహిత్యమాస పత్రిక సాహితీ సమితి, నవ్య సాహిత్య పరిషత్ వంటి సంస్థలను ఏకతాటి మీద నడిపారు. పలు సంకలనాలకు సంపాదకత్వ బాధ్యతలను వహించారు. నీలకంఠం పేరుతో కధాసంకలనాన్ని ప్రచురించారు. అలనాటి పల్లెటూళ్లు విద్యావిదానం చెండామార్కులు స్థాయిలో పిల్లల్ని దండించడం, బలవంతపు  చదువుల నేపధ్యంలో వ్రాయబడ్డ అద్భుత కధ "గాదే". గ్రామాల్లో వడ్లు దాచుకొనే కట్టడం.

Monday 7 April 2014

కధాయాత్ర - 18

కధాయాత్ర - 18
తొలితరం కధకుల్లో కవికొండల వెంకటరావుగారు ముఖ్యులు. భావకవితా యుగంలో ప్రసిధ్దులైన కవికధకులు, నాటక కర్తలు, వ్యాసరచయిత, నవలా రచయిత బహుపాత్రలు పోషించిన అధుత శిల్పి. భావకవితా రచయితగా కవికొండల వెంకటరావ్ సామాన్యుల కోసం తన సాహిత్యాన్ని వారికందేలా చేసారు. కర్షక, కార్మిక, శ్రామిక వర్గల్లోంచి వచ్చిన కధలకు ప్రాణం పోసారు. వీరిని "లి"గార్లు అనేవారు. కష్టజీవుల పనిముట్లు గొడ్డలి, నాగలి, కొడవలి మెదలైనవి "లా" అక్షరమైనవి కదా. అందుకే వీరిని లిగార్లు అనేవారు. లిగాడు పేరుతో గొప్ప కధనే రాశారు. 200లకు పైగా కధలు రాశారు. 10కి పైగా కధాసంపుటాలు వెలువడ్డాయి. కంఠధ్వని , మట్టెల రవళి, ఉద్యోగపు బుధ్ది ప్రధానమైనవి.

Sunday 23 February 2014

ప్రముఖ కథా రచయితల చేవ్రాలు..మీకోసం..

కథా ప్రయాణం - 18

ప్రముఖ కథా రచయితల చేవ్రాలు..మీకోసం...మీకు ఎంతమంది తెలుసో గుర్తించండి.

సేకరణ : కథా సదస్సు కొత్త కదలిక నుంచి


            వేదగిరి రాంబాబు గారి సహకారంతో...

Saturday 15 February 2014

అమరావతి కథలు

కథా ప్రయాణం -17


అమరావతి కథలు


క్లుప్తత కథకు ఉన్న ప్రధాన లక్షణం. అతి తక్కువ పాత్రలతో కథలు నడిపించడం సామాన్యమైన విషయం కాదు. ఆంగ్ల సాహిత్యంలో చిన్న కథలు రాయడంలో చహోను మించిన వారు లేరు. చహో కథల్లో ముగింపు అనూహ్య పరిస్థితుల్లో ముగుస్తుంది. పాఠకులను కన్నీటి సముద్రంలో ముంచేస్తుంది. కథ ఇలా ఉంటేనే బాగుంటుందని చెప్పడానికి సాంకేతికమైన పదాలు ఏమీ లేవు. అందుకే చహో ఆంగ్ల సాహిత్యంలో ధ్రువతారగా మిగిలిపోయాడు. అదే ఒరవడిని కొనసాగిస్తూ సత్యం శంకరమంచి అధ్బుత రీతిలో అమరావతి కథలకు ప్రాణ ప్రతిష్ట చేశాడు. ఒకే ప్రాంత నేపధ్యంలో వచ్చిన కథలు అమరావతి కథలే కావచ్చు. కథల్లోని పాత్రలు, సన్నివేశాలు కృష్ణానది ఇసుకతిన్నేలు మన కళ్ళ ముందే కనబడతాయి. ఒక దృశ్యం మన కళ్ళ ముందే కదిలిన అనుభూతి కలిగిస్తుంది. వరద, పూలసుల్తాన్, పులి, తృప్తి, అధ్బుతంగా సాగుతాయి. అమరావతి కథలకు బాపు వేసిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

Wednesday 5 February 2014

కధ తో ముడి పడిఉన్న కొన్ని జాతీయాలు

కథా ప్రయాణం-16

కధ తో ముడి పడిఉన్న కొన్ని జాతీయాలు

1. నీ కథ చాలాదూరం వచ్చిందే..
2. కథ వెనుక కథ
3. కథకు కాళ్లు లేవు..ముంతకు చెవులు లేవు..
4. కథకు కాళ్లు, ముంతకు చెవులు కల్పించు
5. కథ కంచికి..మనం ఇంటికి..
6. కథ కట్టిపెట్టు..
7. కథ చాలా దూరం వెళ్లిందే..
8. కథ తెలిసి వచ్చింది
9. కథల కామరాజు
10.హరికథలు చెప్పకు
11. కథల పన్ను
12. కథలు కారణాలు
13. కథలు-కారుణ్యాలు
14. అదంతా ఓ పెద్ద కథ
15. కథ కమామీషు
16. కథనాయకుడు
17. కథా శేషుడు కావడం
18. గాలి వాన వస్తే కథే లేదు
19. ఈ కథ ముగిసినట్లే..
20. కాశీ మజిలి కథలు చెప్పకు
21. కట్టుకథల చిత్రాంగి
22. కథా కథనాలు
23. కాకి తో కబురుపంపిస్తే కథ తెలిసింది.
24. కథలు కథలుగా చెప్పుకోవడం
25. కథలు కాకరకాయలు
26. కథన కుతూహలం

- వేలూరి కౌండిన్య   6-2-14                 

Saturday 1 February 2014

తెలుగు కథా సాహిత్యంలో మైలురాళ్ళు

తెలుగు కథా సాహిత్యంలో మైలురాళ్ళు

1. తొలి కథా రచన
జ. తాతాచార్యుల కథలు (1855)
2. మలి కథా రచన
జ. 1903
3. తొలి కథా రచయిత్రి
జ. బండారు అచ్చమాంబ
4. వ్యవహారిక భాషలో తొలి కథా రచయిత
జ. గురజాడ అప్పారావు (దిద్దుబాటు)
5. మత మార్పిడుల నేపథ్యంలో రాసిన తొలి కథ
జ. పెద్ద మసీదు
6. తెలుగు కథ మీద వచ్చిన మొదటి పరిశోధనా గ్రంథం
జ. తెలుగు కథ స్వరూప స్వభావం (పోరంకి దక్షిణామూర్తి)
7. సంచార జీవితాలపై రాసిన తొలి కథ
జ. దాసరి పాట (చింతా దీక్షితులు)
8. తొలి కథ సంకలనం
జ. మద్రాస్ కథలు (వెదురుమూడి శేషగిరిరావు)
9. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి కథ
జ. గాలివాన (పాలగుమ్మి పద్మరాజు)
10. మాండలిక భాషలో మొదటిసారిగా కథలు రాసిన వారు
జ. మా గోఖలే
11. తొలిసారిగా సంభాషణలే ప్రధానంగా కథ నడిపిన రచయిత
జ. శ్రీపాద
12. తనమీద తానే కథ రాసుకున్న రచయిత
జ. చలం (ఒరేయ్ చలం)
13. కథా బీజాలు దేనిలో కనిపిస్తాయి
జ. ఋగ్వేదం
14. స్వాతంత్ర్య ఉద్యమం నేపధ్యంలో రాయబడ్డ తొలి కథ
జ. ఓబయ్య (వేలూరి శివరామ శాస్త్రి)
15. కథల కోసమే నడపబడ్డ తొలి కథా పత్రిక
జ. పూలగుత్తి
16. కథక చక్రవర్తి
జ. కవి కొండల వెంకటరావు
17. కనకాభిషేకం జరిగిన తొలికథ చక్రవర్తి
జ. శ్రిపాద సుబ్రహ్మన్య శాస్త్రి
18. కథానిక లక్షణాలు వున్న తొలి గ్రంథం
జ. అగ్ని పురాణం
19. కార్డు కథలను మొదటిసారిగా ప్రచురించిన పత్రిక
జ. చిత్రగుప్త

Saturday 25 January 2014

కథా ప్రయాణం -14

కథా ప్రయాణం -14


బాగు..బాగు అనిపించుకున్న భమిడిపాటి కామేశ్వర రావు ప్రాధానంగా హాస్య రచయిత. బాగు..బాగు, పెళ్ళి కంట్రోల్, పెళ్ళి ట్రైనింగ్, కచటతపలు వంటి ఎన్నో హాస్య నాటికలు రచించారు. కథానికా సాహిత్యం వీరిని ఆకర్షించడంలో తప్పు లేదు. చదువరు లెవరివైనా తేలికగా ఆకర్షీంచేది కథా సాహిత్యం. అందుకు కారణం అందులో జీవ లక్షణం ఉండడమే. హాస్య కథలు రాయడం అంత ఆషామాషి కాదు. నవకాయ పిండి వంటల్లో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుందో అందులో హాస్యరసం లోపిస్తే అనితర సాధ్యమైన హాస్యాన్ని కథల్లో జొప్పించిన కథకుడు భమిడిపాటి. నిజం, ఔను, తనలో అనే పేరుతో 3 కథా సంపుటాలను ప్రచురించారు. మడత పేజి కథ తప్పక చదవాల్సిందే. 

Friday 24 January 2014

కథా ప్రయాణం-13

కథా ప్రయాణం-13


తెలుగు సాహిత్యంలో రెండు సంఘటనలు తప్పనిసరిగా గుర్తుచేసుకోవాలి. భిన్న మనస్తతత్వాలు, భిన్న ధోరణులు, తూర్పు,పడమరలు. వారు ఒకరు చలమైతే, మరొకరు కథా మాణిక్యం మునిమాణిక్యం నరసింహారావు. ఒకరు విశృంఖుల శృంగారాన్ని ప్రోత్సహిస్తే మరొకరు దాంపత్యంలోని మధురిమలను అందించారు. భార్య అంటే ఎలా ఉండాలి?సంసారంలోని మధురిమలు ఎల పొందాలి అన్న విషయాన్ని హాస్యభరితంగా చెప్పాడు మునిమాణిక్యం. మునిమాణిక్యం కథానాయక కాంతం. ఆధునిక తెలుగు సాహిత్యంలో కాంతం ఐస్కాంతంలా ఎందరిని అలరించలేదు. కాంతం పేరు తెలియని తెలుగు పాఠకుడు ఉండడు. పరమ సంతోషకరమైన కుటుంబ జీవిత ఇతివృత్తాన్ని కథగా చెప్పిన కథా కృషీవలుడు. గందరగోళంగా ఉన్న తెలుగు సాహిత్యంలో ఒయాసిస్సు లాగా, వెన్నెల రాత్రి లాగా ఆయన కథలు దర్శనమిస్తాయి. కాంతం కథలు నేను నా కాంతం, తిరుమాలిగ, రుక్కుతల్లి లాంటి హాస్య కథలు ఎన్నో రాశారు. ఆయన కథలన్నీ శారద రాత్రులే.

వేలూరి కౌండిన్య.. 24-1-14

Saturday 18 January 2014

నా పుస్తక సమీక్ష

12-1-14న ఆంధ్రభూమి దినపత్రిక మెరుపు శీర్షికలో నా పుస్తక సమీక్ష ప్రచురితమైంది. చదివి మీ అభిప్రాయం తెలుపగలరు. 

Tuesday 14 January 2014

Sunday 12 January 2014

కథా ప్రయాణం-12

కథా ప్రయాణం-12


కథా సాహిత్యంలో రాసి కన్నా వాసి ముఖ్యం. క్లుప్తత అంతకన్నా ముఖ్యం. చెప్పదలుచుకున్న విషయాన్ని ఏ మాత్రం భేషిజం లేకుండా చెప్పడం, నినాదాల జోలికి పోకుండా సూటిగా ఆలోచింపజేయడం కథానికలో ఒక భాగం. కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారిలో చా.సో.(చాగంటి సోమయాజులు) నేటి తరం కమ్యూనిస్టులుగా కాకుండా వామపక్ష భావాలు కలిగి నినాదాలు, కొట్టు,చంపు, నరుకు పదాలులేకుండా శ్రామైక్య జీవనంలోని అందాలను చక్కగా వర్ణించిన కధా రచయత చా.సో.రాసినవి 30 కథలకు మించకు పోయినా తన రచనా కౌశలం ద్వారా కీర్తి గడించారు చా.సో. వీరి కథలు విశిష్టత, సాంఘిక ప్రయోజనం కలిగి ఉంటాయి. బొండు మల్లేలు, ఎందుకు పారేస్తాను నాన్న, వెలం వెంకడు కథలు చదవాల్షిందే.


నోట్ : మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేస్తారు కదూ..

9392942485


















స్వామి వివేకానంద జయంతి

స్వామి వివేకానంద జయంతి