Saturday 15 February 2014

అమరావతి కథలు

కథా ప్రయాణం -17


అమరావతి కథలు


క్లుప్తత కథకు ఉన్న ప్రధాన లక్షణం. అతి తక్కువ పాత్రలతో కథలు నడిపించడం సామాన్యమైన విషయం కాదు. ఆంగ్ల సాహిత్యంలో చిన్న కథలు రాయడంలో చహోను మించిన వారు లేరు. చహో కథల్లో ముగింపు అనూహ్య పరిస్థితుల్లో ముగుస్తుంది. పాఠకులను కన్నీటి సముద్రంలో ముంచేస్తుంది. కథ ఇలా ఉంటేనే బాగుంటుందని చెప్పడానికి సాంకేతికమైన పదాలు ఏమీ లేవు. అందుకే చహో ఆంగ్ల సాహిత్యంలో ధ్రువతారగా మిగిలిపోయాడు. అదే ఒరవడిని కొనసాగిస్తూ సత్యం శంకరమంచి అధ్బుత రీతిలో అమరావతి కథలకు ప్రాణ ప్రతిష్ట చేశాడు. ఒకే ప్రాంత నేపధ్యంలో వచ్చిన కథలు అమరావతి కథలే కావచ్చు. కథల్లోని పాత్రలు, సన్నివేశాలు కృష్ణానది ఇసుకతిన్నేలు మన కళ్ళ ముందే కనబడతాయి. ఒక దృశ్యం మన కళ్ళ ముందే కదిలిన అనుభూతి కలిగిస్తుంది. వరద, పూలసుల్తాన్, పులి, తృప్తి, అధ్బుతంగా సాగుతాయి. అమరావతి కథలకు బాపు వేసిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

1 comment:

  1. మీ బ్లాగులో, వివిధ రచయితల కధా సమీక్షలు చక్కగా చేస్తున్నారు ! అభినందనలు !
    ఒక్క సూచన: మీ బ్లాగుకు ' కౌండిన్య కధా సమీక్షలు ' అని పేరు పెట్టండి !

    ReplyDelete