Tuesday, 31 December 2013
Sunday, 29 December 2013
కథాప్రయాణం - 11
కథాప్రయాణం - 11
అచ్చమైన తెలుగు నుడికారంతో తెలుగు లోగిళ్ళను అద్భుతంగా చిత్రించిన మల్లాది రామక్రిష్ణశాస్త్రి, మాటల్లో తెలుగుతనం వ్యవహారంలో తెలుగు నుడికారం తేటతెల్ల మవుతుంది. "కోనలో కొమ్మ" కోటలో కోడెగాడు, గూడెంలో నాయకుడు, అల్లనేరేడు, చెంగల్వ, మునిగోరింట కథలను పరిశీలిస్తే తెలుగు మీద మల్లాది వారికి ఎంత అభిమానమో తెలుస్తుంది.
కధా ప్రయాణం - 10
కధా ప్రయాణం - 10
కందుకూరి అనంతం మరో రమణీయ మణిపూస. కరుణకుమారపేరుతో కథలు రాసారు. నెల్లూరు లో రెవెన్యూ ఆధికారిగా పని చేయడంవలన బదుగు జీవుల విధానం తెలుసుకునే అవకాశం దక్కంది. సహజంగా భావకుడైన కరుణకుమార వారి జీవితాలని తమ కథల్లో చిత్రించారు. తెలుగు వారి ప్రేమచంద్ గా పిలవబడే కరుణకుమార 30 కి పైగా కధలు రాశారు. కయ్యకాలువ, అంటుజాడ్యం మంచి కధలు.
Sunday, 15 December 2013
కధాయాత్ర - 9
కధాయాత్ర - 9
కధకు కాళ్ళు లేవు, ముంతకు చెవుల్లేవు అన్నది సామెత మాత్రమే. ఎందుకంటే కధకు కాళ్ళే లేకపోతే ఇన్నేళ్ళు ఎలా ప్రయాణం చెయ్యగలదు. తాతలు, నాన్నమ్మలు కధలు చెప్పడం పూర్తయ్యాక "కధ కంచికి మనం ఇంటికి" అంటూ ముగిస్తారు. కధ కంచికి వెళ్ళేట్లయితే కంచి అంతా కధలతో నిండిపోతుంది. ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయిన ఈగను గుర్తు తెచ్చుకోండి, అదే సందర్భంలో రాజుగారు ఏడు చేపల కధను పరిశీలించండి. తన పేరును గుర్తుకు తెచ్చుకోవడం కోసం, ఈగ పడ్డ తపన చివరకు చీమ గుర్తు చెయ్యడం. చిన్నప్రాణి వల్ల కూడా ఉపయోగం చెబుతుంది. "పంచతంత్రం" కధలు సామాజిక ప్రయోజనాన్ని గుర్తుచెయ్యటం లేదు. "కధ" అనే మాట ప్రయోగం, మనిషి జీవితంలో ఓ భాగమై పోయింది. భర్త భార్యకు, విద్యార్ధి మాష్టారికి, కొత్త కోడలు అత్తగారికి, ప్రియుడు ప్రేయసికి కధలు చెప్పని సందర్భాలు వుంటాయా ?
Tuesday, 10 December 2013
కధాయాత్ర - 8
కధాయాత్ర - 8
ఆధునిక కధాసాహిత్యంలో చలం అంతటి వివాదస్పద రచయిత మరొకరు వుండరు. ఒకానొక దశలో సాహిత్య భహిష్కరణకు గురి అయిన రచయిత చలం తప్ప మరొకరు లేరేమో. "చలం సాహిత్యాన్ని ప్రచురించటానికి భయపడే రోజులు కుటుంబ స్త్రీలు చలాన్ని చదవటానికి భయపడే రోజులు చలం కధా అసదృశ్యుడు. "స్త్రీ" స్వేచ్ఛకోసం తపించిన వ్యక్తి అని అభిమానులు చెప్పుకుంటారు. కధల్లో, శృంగారరసం ఎక్కువ, అందుకే చలాన్ని చదవటం భయపడేవారు అంతర్గతంగా చలాన్ని చదివిన వారు లేకపోలేదు. "గ్రహణం" , "ఓపూవు పూసింది", ప్రసిద్ధం. 'దైవమిచ్చిన భార్య, "మైదానం" విమర్శకులను ఆకర్షించాయి. స్త్రీలను గురించి పోరాడిన చలం, చివరిదశలో అస్త్రసన్యాసం చెయ్యటం పొరపాటేనంటారు.కధాయాత్ర - 7
విశ్వనాధను ప్రేమించే వారు ఎంతమంది ఉంటారో, ద్వేషించేవారు అంతకు మించిన సంఖ్యలోనే ఉంటారు. పద్యం, గద్యం, నవల, నాటకం, కధలాంటి సాహిత్య ప్రక్రియల్లో విశ్వనాధ నిష్ణాతుడు "జ్ఞనపీఠం" నాకుతప్ప మరెవరికి ఇస్తారు అని చెప్పగల ధీశాలి. "మాక్లీదుర్గంలో కుక్క" జీవుని ఇష్ఠం "చామరగ్రాహి" వీరి ప్రసిధ్దకవులు.Monday, 9 December 2013
కధాయాత్ర - 6
కధాయాత్ర - 6
మాడపాటి హనుమంతరావు పంతులుగారు బహుభాషా వేత్త, కధానికకు జవసత్వాలు నింపిన వ్యక్తి.1912 ప్రాంతంలోనే ఆంధ్రభారతిలో వీరికధలు ప్రచురణకునోచుకున్నాయి. తొలి తెలుగు కధల సంపుటి మదరాసు కధలని అంటారు. తరువాత మాడపాటివారి 'హృదయశల్యము ' అనే కధ అదే పేరుతో కధాసంపుటి వచ్చింది. గ్రాంధిక భాష ఛాయలు వీరి కధల్లో కనిపిస్తాయి.కథా ప్రయాణం-5
కథా ప్రయాణం-5
తెలుగులో ఉత్తమ కథకులుగా, ధ్రువతారలుగా నిలిచిపోయేవారు కొందరే ఉన్నారు. వారి కథలను పరిశీలిస్తే వారెంత మనుషులో మనకు తెలుస్తుంది. గురజాడ,వేలూరి,బుచ్చిబాబు,గోపిచంద్, చలం, శ్రీపాద, మల్లాది, కొడవటిగంటి కుటుంబరావు, కరుణ కుమార్,చాసో, పాలగుమ్మి పద్మరాజు, చింతా దీక్షితులు, అడవి బాపిరాజు, కా.రా.., జమదగ్ని, మా గోఖలే, అమరేంద్ర, పంతుల శ్రీ రామశాస్త్రి, రావి శాస్త్రి, ఆచంట శారదా దేవి, రావూరి భరద్వాజ, కాళోజి, గూడూరి సీతారం, ఇల్లెందుల, కొమర్రాజు, భాగ్య రెడ్డి వర్మ లాంటి వందల మంది తెలుగు కథలు పరిపుస్టం చేసారు. ఫ్రాంతాల వారీ విడిపోవచ్చు. కులాలుగా విడిపోవచ్చు. దేశాల సరిహద్దులను చెరిపి వేయచ్చు. విశ్వ మానవ సౌభాతృత్వాన్ని కోరేది మాత్రం సాహిత్యమే.తెలుగు కథా సాహిత్యం విశ్వనాథ లాంటి పండితుల్ని, వేలూరి లాంటి శతావధానుల్ని అడవి బాపిరాజు లాంటి చిత్రకారుల్ని చింతా దీక్షితులు, చలం లాంటి ఉన్నతాధికారుల్ని, పీవీ నరసింహారావు లాంటి రాజకీయవేత్తల్ని ఆకర్షించింది. శ్రీ పీవీ నరసింహారావు దేశ ప్రధాని, ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. బహుభాషా వేత్త. విశ్వనాథ వేయి పడగల్ని సహస్రఫణ్ పేరుతో అనువదించారు. గొల్ల రామవ్వ లాంటి గొప్ప కథను రాశారు. ఒకటి, రెండు కథలు తప్ప అందుబాటులో లేవు.
చింతా దీక్షితులు(1891) గొప్ప కథకులు. తొలితరం కథకుల్లో లెక్కించతగినవారు. దాసరిపాట లాంటి గొప్ప కథల్ని రచించారు. వటిరావు కథలు దీక్షితులు గారి ప్రత్యేకం. చలం గారి సమకాలీకులు.
- వేలూరి కౌండిన్య 10-12-13.
Saturday, 7 December 2013
కధా యాత్ర 4
కధా యాత్ర 4
తెలంగాణా సాహిత్యాన్నిపరిపుష్టం చేస్తూ, ఆంధ్రుల సాంఘీక చరిత్రకు రూపమిచ్చిన సురవరం ప్రతాపరెడ్డి ప్రాతస్మరణీయుడు. గోలుకొండ పత్రికను అప్రతిహాతంగా నడిపిస్తూనే పంతం పట్టి 1930 ప్రాంతంలోనే తెలంగాణా కవుల చరిత్రను పరిశీలించి, పరిశోధించిన మహోన్నత వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి కధ. సురవరం వారిని తెలుగు కధ కూడా ఆకర్షించింది. వీరు దాదాపు 25 కధలు రాశారు. అణాగ్రంధమాల వారు తెలుగు సాహిత్యానికి చేసిన సేవ నిరుపమానం. మొగలాయి కధలు నిరీక్షణ గ్యారా కద్దూ బారాకొత్యాల్ ప్రసిద్ధం.
Friday, 6 December 2013
కధా ప్రయాణం - 3.
కధా ప్రయాణం - 3.
గురజాడ రాసిన 'దిద్దుబాటు కధ ఆంధ్రభారతిలో 1910 ఫిబ్రవరిలో అచ్చయితే మాడపాటి హృదయశల్యము కధ. 1912 లో ఆంధ్రభారతిలోనే అచ్చయింది. 1902 ప్రాంతంలో ఆచంట వెంకట సాంఖ్యనశర్మ 'లలిత ' అనే కథను రాశారు. ఇది కూడా గ్రాంధిక భాషలోనే సాగడం విశేషం. వీరే కధల కోసం ' పూలగుత్తి ' అనే కథను నడిపారు. బండారు అచ్చమాంబ కథ స్త్రీ విద్య విత్తనమైతే, సుక్షేత్తమైన నేలలో పడటం వల్ల,నేడది ఇంతితై వటుడింతై అన్నట్లు శాఖోపశాఖలుగా విస్తరించింది. వచ్చిన కథలన్నీ గొప్ప కథలని చెప్పలేం, కాలానికి నిలిచే కథ ఏది అంటే జవాబు చెప్పటం కష్టం. ఏ కధలో నైతే జీవ లక్షణం వుంటుందో అదే జీవకధ అవుతుంది. కధ దాటిన ఎల్లలు లేవు. తిరగని బోటులేదు. ఎక్కని పర్వతాలు లేవు. చంధోబద్ధమైన కవిత్వం తరువాత, కథ తరువాత స్ధానాన్ని ఆక్రమిస్తుంది. ఆంగ్లభాష, ప్రభావం, తెలుగు కధను పరిపుష్టం చేసిందనటంలో సందేహం లేదు.Thursday, 5 December 2013
Wednesday, 4 December 2013
Tuesday, 3 December 2013
తెలుగు కథా ప్రయాణం-2
తెలుగు కథా ప్రయాణం-2
తెలుగు కథకు మొదటి అడుగు అచ్చమాంబ వేస్తే దిశా నిర్దేశం చేసింది శ్రీపాదతో కలిపి చాలామందే ఉంటారు. కధకు సామాజిక ప్రయోజనం ఉండాలి. కన్నీళ్ళు పెట్టించాలి. ఆలోచింపజేయాలి. గోదావరి మాండలికంలో శ్రీపాద 100కు పైగానే కథలు రాశారు. తెలుగు కధకు జవసత్వాలు నింపింది శ్రీపాద. క్రీడల నేపధ్యంలో రాసిన వడ్లగింజలు మొదటికథగా విమర్శకులు చెబుతారు. గులాబి అత్తరు అత్తరు లాంటి అధ్బుత కథలు శ్రీపాద మాత్రమే రాయగలరు. వీరేశలింగం పంతులును నాయకుడిగా చేస్తూ శ్రీపాద అనేక కథలు రాశారు.
తెలుగు కథ ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా..
తెలుగు కథ ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా..
తెలుగు కథ గురజాడ దిద్దుబాటుతో ప్రారంభం కాలేదు.(1910). 1903 లో బండారు అచ్చమాంబతో ప్రారంభమైంది. వామ పక్ష భావాలు కలిగిన కొందరు గురజాడ పల్లకి మోస్తూ అచ్చమాంబకు అన్యాయం చేశారని చెప్పక తప్పదు. గురజాడకు ముందే తెలుగు కథ ఊపిరి పోసుకుంది. 1800 సంవత్సరంలోనే బ్రౌన్ తాతాచార్యుల కథలను సంకలనం చేశారు. ఆ కాలంలోనే కథల కోసం పూలగుత్తి అనే పత్రిక నడిచేది.
గురజాడ
Subscribe to:
Posts (Atom)